చిలిపిచెడ్, డిసెంబర్ 22: రాష్ట్రంలోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని టోప్యా, గణ్య, బద్రియ తండాలు, గౌతాపూర్ గ్రామాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్‌లను ఆమె అభినందించి సన్మానం చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేయాలని సూచించారు.
నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సభ ఉంటుందని, ఈ కార్యక్రమానికి గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు,వార్డు సభ్యులు హాజరు కావాలని ఆమె పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి,నాయకులు రాజిరెడ్డి, నరేందర్‌రెడ్డి, దుర్గారెడ్డి, బెస్త లక్ష్మణ్, పోచయ్య, శంకరయ్య, భీమయ్య, విఠల్, బుజ్జిబాయి పాల్గొన్నారు.
నర్సాపూర్, డిసెంబర్ 22: నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధ్దికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు.