చిలిపిచెడ్, ఏప్రిల్ 16: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని జగ్గంపేటలో చలో వరంగల్ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. స్వరాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కు ప్రజల్లో విశేష ఆదరణ ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేక పోయిందన్నారు. ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా బంద్ పెట్టి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, రాంచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు గోపాల్‌రెడ్డి, యాదగిరి, దుర్గారెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, షఫీయొద్దీన్, వీరాస్వామి, విఠల్, కున్యానాయక్, మధు, గోపాల్‌నాయక్ తదితరలు పాల్గొన్నారు.