పటాన్చెరు, అక్టోబర్ 11 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కలగానే మా రింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్‌చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేస్తూ జీవో జారీ అయ్యిం ది. సంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు పటాన్చెరు నుంచి అధిక ఆదాయం వస్తుంది. అందువల్ల అధికారులు పటాన్చెరులో జిల్లా కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయం ఏర్పాటుకు ఏర్పాట్లు చేశారు. దీనిని గిట్టని కొందరు దీనిపై కోర్టులో కేసు వేయడంతో సంగారెడ్డి నుం చి సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయం పటాన్‌చెరుకు తరలింపును నిలిపివేశారు. సంగారెడ్డిలోని కందిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగుతున్నది. దీంతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు రిజిస్ట్రేషన్‌కు కందికి పోవాల్సి వస్తుడడంతో సమయభావంతో పాటు ఆర్థిక భారం పడుతున్నది.
పటాన్చెరు హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో పారిశ్రామిక అభివృద్ధి చెందింది.వాణిజ్య, వ్యాపారంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం, జిన్నారం, గుమ్మడిదల మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో పటాన్చెరు, రామచంద్రపురం మండలాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. అమీన్పూర్, తెల్లాపూర్ , ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, బొల్లారం, గడ్డపోతారం మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎక్కువగా రియల్ వ్యాపారులు అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండ్ల నిర్మాణం జోరుగా చేస్తున్నారు.
కొత్తగా వెంచర్లు ఏర్పాట్లు చేసి ప్లాట్లు అమ్మకాలు చేస్తున్నారు. ప్రతి రోజు రిజిస్ట్రేషన్ కోసం పటాన్చెరు ప్రాంతానికి చెందిన వారు సంగారెడ్డి సమీపంలోని కందిలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోవాల్సి వస్తున్నది. దీంతో డబ్బుతో పాటు సమయం వృథా కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పటాన్చెరు ప్రాంతంలో అనేక రాష్ర్టాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, సాఫ్ట్వేరు ఇంజినీర్లు, వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాట్ల్లకు, అపార్ట్మెంట్, విల్లాలకు భారీగా డిమాండ్ పెరిగింది. పాశమైలారం, బొల్లారం, పటాన్చెరు, జిన్నారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, గుమ్మడిదల, సుల్లాన్పూర్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి.
దేశంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పటాన్చెరులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంగారెడ్డి పోవాల్సిన పరిస్థితి ఉంది. కందిలోని పటాన్చెరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లను పెట్టుకొని యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటరు లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడం లేదు. జిల్లా అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతికి కేంద్ర ంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం మారింది. డాక్యుమెంట్ రైటర్లు ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి అధికారులకు మామూళ్ల ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పటాన్చెరులో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రజలు కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు జీవో జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కొం దరు హైకోర్టులో కేసు వేయడంతో కార్యాలయం సంగారెడ్డి నుంచి పటాన్‌చెరుకు తరలింపు నిలిపివేశారు. కోర్టు తీర్పు వచ్చినా అధికారులు కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవో జారీ చేస్తే కార్యాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వారు ముందుగా డాక్యుమెంట్ రైటర్‌ను కలిసి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చిన తర్వాత పని ముందుకు సాగుతున్నది. డాక్యుమెంట్ రైటర్ చెప్పినంత డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంగారెడ్డిలో ఉన్న కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. పటాన్చెరులో కార్యాలయం ఏర్పాటు చేసి ఇబ్బందులు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పటాన్చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో జీవో వచ్చినా కోర్టులో కేసు ఉండడంతో కార్యాలయం ఏర్పాటు నిలిపివేశారు. ప్రస్తుతం కార్యాలయం ఏర్పాటుకు కొత్తగా జీవో జారీ కావాలి. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా కార్యాలయం ఏర్పాటు చేయలేం. పటాన్చెరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి నివారించేందుకు చర్యలు తీసుకుంటాం. డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు.
-సుబ్బలక్ష్మి, జిల్లా రిజిస్ట్రర్ సంగారెడ్డి
పటాన్చెరులో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీచేసింది. కొందరు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు కాకుండా కుట్రచేసి అడ్డుకున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం సంగారెడ్డి సమీపంలోని కందికి పోవాల్సి వస్తున్నది. రిజిస్ట్రేషన్ కోసం సంగారెడ్డికి పోవడంతో సమయం, డబ్బులు ఖర్చు అవుతున్నాయి. పటాన్చెరులో ఆఫీసు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టిపెట్టి పటాన్చెరులో ఆఫీస్ ఏర్పాటు చేయించాలి.
-కుమార్, బీఆర్ఎస్ నాయకుడు రామచంద్రాపురం