మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), జూన్ 14: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బడిబాటలో భాగంగా శుక్రవారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని భూంపల్లి, రుద్రారం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు గొప్పలకు పోయి ప్రైవేట్ బడుల్లో పిల్లలను చేర్పించి ఆర్థికంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషన్, రాజేందర్, ఆర్.మల్లేశం, రామచంద్రం, బాలకిషన్, కరుణాకర్, శ్రీనివాస్, శ్రీ విద్య పాల్గొన్నారు.
వర్గల్,జూన్14: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఒకటో తరగతి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్‌గౌడ్ పాల్గొని మాట్లాడారు. పాఠశాల హెచ్ఎం మధుసూదన్, సీఆర్పీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రాయపోల్, జూన్ 14 : మండలంలోని వడ్డేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు, ఉపాధ్యాయులు విద్యాసాగర్, జీనత్ పాల్గొన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), జూన్ 14 : కుకునూరుపల్లి మండల కేంద్రంలోని మండల ప్రాథమిక పాఠశాలలో సరస్వతీ విగ్రహం ఎదుట విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), జూన్14: మద్దూరు మండలం వల్లంపట్ల ప్రాథమికోన్నత పాఠశాల, ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్ ప్రాథమిక పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్య్రక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
చేర్యాల, జూన్ 14: మండలంలోని ఆకునూరు ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్ఎం ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించగా బీఆర్ఎస్ మండల నాయకుడు జంగిటి భిక్షపతి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలు సొంత ఖర్చులతో అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం కర్రోళ్ల విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు కె.బాలమల్లు, సీఆర్పీ కనకరాజు, బీజేఆర్ యూత్ నాయకులు ముచ్చాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు ముచ్చాల వంశీ పాల్గొన్నారు.
హుస్నాబాద్‌టౌన్, జూన్ 14: హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో శుక్రవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ వేముల మంజుల, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. వెంకటయ్య, సీఆర్పీ జోత్స్నతోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.