Sport Schools | పాపన్నపేట, జూన్ 16 : తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతిలో చేరడానికి ఈ నెల 19 నుండి 25 వరకు మండల స్థాయి ఎంపిక కొనసాగుతుందని మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణవ్యాప్తంగా హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని పాఠశాలల్లో చేరడానికి విద్యార్థినీ విద్యార్థుల ఎంపిక కొనసాగుతుందన్నారు. మండల స్థాయి ఎంపిక ఈ నెల 19 నుంచి పాపన్నపేట ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తామన్నారు.
8 నుంచి 9 సంవత్సరాల వయసు గలవారు ఈ పాఠశాలల్లో చేరడానికి అర్హులని ఆయన వెల్లడించారు. మిగతా వివరాలకు మండల విద్యాధికారి ప్రతాపరెడ్డి, 8500200859, ఫిజికల్ డైరెక్టర్ రమేష్ ఫోన్ 9010735121 నెంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు సూచించారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత