Street Lights | వెల్దుర్తి, మార్చ్ 22 : అసలే వేసవి.. ఓ వైపు ఎండలు ముదురుతుంటే.. మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండగా.. కరెంట్‌ను వృధా చేస్తూ పగటి పూట కూడా వీధి ధీపాలు వెలుగుతున్నాయి. ఈ దృశ్యం మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి గ్రామంలో కనిపించింది.
కొప్పులపల్లి గ్రామంలోని బొమ్మారం వైపు వెళ్లే ప్రధాన రోడ్డు వెంబడి ఉన్న వీధి దీపాలతోపాటు పలు వీధుల్లో పగటి సమయంలో వీధి దీపాలు వెగులుతూ కరెంట్ వృధా అవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
ఈ ఘటనపై సంబంధిత పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పగటి పూట వెలుగుతున్న వీధి దీపాల విద్యుత్ లైన్లను సరిచేసి, విద్యుత్ వృధాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు