కంది, జూన్ 4 : సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాస్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా విధుల్లో ఉన్న ప్రసాద్ చౌహాన్‌ను హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుత కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి దుబ్బాక మున్సిపల్ నుంచి బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. వర్కింగ్ డే అని కూడా చూడకుండా సంగారెడ్డి మున్సిపల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అందరినీ స్పెషల్ బస్సులో టూర్‌కు తీసుకెళ్లడంతో కమిషనర్ ప్రసాద్ చౌహాన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు.