Sport Schools | నర్సాపూర్, జూన్17 : ఈ నెల 18 నుండి క్రీడా పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి తారాసింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడా పాఠశాలలో 4వ తరగతి విద్యార్థులు చేరడానికి స్పోర్ట్స్ అథారిటీ సెలక్షన్ కమిటీ మండల, జిల్లా స్థాయిలో 18 మరియు 19 తేదీల్లో ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ పాఠశాలలకు ఎంపిక జరుగుతుందని తెలిపారు. కావున నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో 18 నాడు ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఈ ఎంపికకు అర్హత గల విద్యార్థులు 3వ తరగతి పూర్తి చేసి ఉండాలని.. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఉండాలని సూచించారు. వీరికి కళాశాల మైదానంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా