మెదక్ అర్బన్, అక్టోబర్ 26: దీపావళి పండుగ సందర్భంగా పటాకుల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపా రు. అనుమతిలేకుండా టపాకాయల దుకాణాలు నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ 1884, రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
టపాకాయల దుకాణాలను సంబంధిత ఖాళీ ప్రదేశాల్లో నెలకొల్పాలని, ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్వోసీ సర్టిఫికెట్ పొందుపర్చాలని ఎస్పీ పేర్కొన్నారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదని, జన రద్దీ గల ప్రదేశాల్లో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదని సూ చించారు. దుకాణాల్లో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారే పనిచేయాలని, గో దాం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.