Unseasonal rains | పెద్ద శంకరంపేట, మార్చి 22 : పెద్ద శంకరంపేట మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వీరోజిపల్లి, ఉత్తులూర్, రామోజీ పల్లి, నారాయణ పల్లి, జూకల్ గ్రామ శివారులో సుమారు 30 ఎకరాల జొన్న పంట నేలకొరగడంతో పంట నష్టం సంభవించింది.
ఉత్తులూర్ గ్రామానికి చెందిన చంద్రాగౌడ్, సతీష్, జీవయ్య, వీరోజిపల్లి గ్రామానికి చెందిన శివరాములు, సాయిలు, కృష్ణ,గోవింద్, సంగయ్యలకు చెందిన జొన్నపంట నష్టం సంభవించినట్లు రైతులు పేర్కొన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షంతోపాటు వడగండ్లు పడటంతో తాము ఆర్థికంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా మండల వ్యవసాయాధికారి నాగం కృష్ణ, ఏఈవో మమతలను సంప్రదించగా.. ఆయా గ్రామాల్లో జొన్నపంట నేలకొరిగిందని అన్నారు. పంటనష్టం వివరాలను అంచనా వేసి వీటి నివేదికను ఉన్నతాధికారులకు అంజేస్తామన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు