మెదక్ అర్బన్, జూలై19 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని ఫతేనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు , కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ పట్టణంలోని ఫతేనగర్‌లో నివాసముంటున్న మాదిగ కిషన్, బాలమణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు ప్రశాంత్ (23) ప్రతి రోజు మద్యం సేవించి రావడంతో తల్లి మందలించడంతో ఈ నెల 18న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయడని పేర్కొన్నారు.
మంగళవారం మెదక్ పట్టణ పరిసరప్రాంతంలోని గోసముద్రం చెరువులో ఓ మృత దేహం కన్పించదని చేదుల నవీన్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించాడు. కాగా, మృతదేహం ప్రశాంత్‌దేనని అతడి సోదరుడు తెలిపారు. ప్రశాంత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.