నిజాంపేట,మే23 : ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల ఏవో సోమలింగారెడ్డి మండల రైతులకు సూచించారు. శుక్రవారం నిజాంపేట రైతువేదికలో ఏవో రైతులతో సమావేశం నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 11 అంకెల నంబర్ వస్తుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అందించనున్న ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరుతాయన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు పట్టాదారు పాసుబుక్, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్లస్టర్ల వారీగా ఉన్న ఏఈవోలకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో రైతులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ComeBack Rally | రేప్ కేసులో బెయిల్.. నిందితుల విజయోత్సవ ర్యాలీ.. VIDEO
Kenishaa Francis | జయం రవి-ఆర్తీ విడాకుల వివాదం.. కెనీషా ఫ్రాన్సిస్‌కు హత్య బెదిరింపులు
Olive Oil | వంట నూనెల్లో ది బెస్ట్ ఆయిల్ ఇది.. దీన్ని వాడారంటే మీకు ఎలాంటి వ్యాధులు ఉండవు..!