Collector Rahul Raj | మెదక్ రూరల్, జూలై 24 : భూసార పరీక్ష రైతన్నకు రక్ష అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండలం కూచన్‌పల్లి రైతు వేదికలో లారస్ ల్యాబ్ చారిటబుల్ ట్రస్ట్ , ఇక్రిసాట్ సంయుక్తంగా కలిసి రైతులు వ్యవసాయ సంక్షేమం కోసం అవగాహన కల్పించడం జరిగింది.
భూసార పరీక్ష వాహనం ద్వారా రైతుల ముంగిట్లోకి భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలను నేల ఆరోగ్య కార్డు రూపంలో అందించడం, పంటలకు సరైన మోతాదులో రసాయన ఎరువుల వినియోగం ద్వారా సమగ్ర పోషక యాజమాన్యం పాటించి పెట్టుబడి ఖర్చు తగ్గించడం తద్వారా అధిక దిగుబడులు సాధించుకుంటూ నేల సంరక్షణ దోహదం చేయడం పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసార పరీక్ష రైతన్నకు రక్ష అని అన్నారు. ఈ వాహనం ద్వారా రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహించి రైతులకు నేల ఆరోగ్య కార్డును అందజేయడం జరుగుతుందన్నారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా, మీ పొలానికి ఏ రకాల ఎరువులు అవసరమో తెలుసుకోవచ్చు. తదనుగుణంగా పంటలను సాగు చేసుకోవచ్చునని తెలిపారు.
కూచన్‌పల్లి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు ఇక్రిసాట్ వారి ద్వారా భూసార పరీక్షలు నిర్వహణ అనే అంశంపై క్షుణ్ణంగా విద్యార్థులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మెనూ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నలు, జవాబులతో పరీక్షించారు.
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం..
అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డాక్టర్ పుష్పాజిత్ చౌదరి, విజయ రంగనాథ్ , ఏడీఏ విజయ నిర్మల, ఎంఈఓ మదన్ మోహన్, ఏవో బాల్ రెడ్డి ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, రైతులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Ganja Seized | ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vice president Elections | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఈసీ