రాయికోడ్, జనవరి 3: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం రాయికోడ్‌లో ఏర్పాటు చేసిన ప్రజపాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశామన్నారు. మిగతా గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు చేపట్టనున్న గ్రామసభల్లో ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాయికోడ్ మండలం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని తెలిపారు. మంత్రి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించి, రశీదులు అందజేశారు.
సింగితం గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి జగదీశ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశం, ఎంపీపీ మమతాఅశోక్కుమార్, మాజీ జడ్పీటీసీ అంజయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ యేసయ్య, సర్పంచ్ కేదారినాథ్పాటిల్, ఎంపీటీసీ మొగులప్ప, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు మక్సూద్, సతీశ్ పంతులు, శివకుమార్, డాక్టర్ వెంకటేశం, నాగరాజుగౌడ్, దుర్గేశ్, సునీల్ పాల్గొన్నారు.