మెదక్, మార్చి 27(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో సీతారాముల కళ్యాణ వేడుకలు కనుల పండుగగా నిర్వహించారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంతో పాటు రామాయంపేట, పెద్ద శంకరంపేట్, నర్సాపూర్, తూప్రాన్ తో పాటు పలు మండలాలలో సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మెదక్ పట్టణంలో కోదండ రామాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Mulugu | నిండు గర్భిణికి అందని వైద్యం.. డెలివరీ చేసిన అంబులెన్స్ టెక్నీషియన్
Petrol Price | వాహనదారులకు షాక్.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన నయారా