న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ చమురు రిటైలింగ్ సంస్థ నయారా ఎనర్జీ గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చమురు ధరల పెంపు తదితర కారణాల వల్ల గురువారం నుంచి లీటర్ పెట్రోల్‌కు రూ. 5, డీజిల్‌కు రూ. 3 పెంచింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో ఉన్న 1,02,075 పెట్రోల్ పంపులలో నయారా ఎనర్జీ 6,967 పంపులను నిర్వహిస్తున్నది. చమురు ధరల పెరుగుదలలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించింది.