Mulugu | నిండు గర్భిణికి అందని వైద్యం.. డెలివరీ చేసిన అంబులెన్స్ టెక్నీషియన్
Mulugu పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. అంబులెన్స్ సిబ్బందే అన్నీ తామై ఆ గర్భిణికి డెలివరీ చేసిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో గురువారం జరిగింది.
Mulugu | గోవిందరావుపేట, మార్చి 26 : పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. అంబులెన్స్ సిబ్బందే అన్నీ తామై ఆ గర్భిణికి డెలివరీ చేసిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండలం దూలాపురానికి చెందిన మోడెం సమ్మకకు పురిటి నొప్పులు రావడంతో ఆశా వరర్ శ్రీదేవి అంబులెన్స్‌కు సమాచారం అందించింది.
ప్రసవం కోసం ఆమెను తొలుత వాజేడు పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు రెఫర్ చేశారు. ఏటూరునాగారం వైద్యశాలకు తీసుకెళ్లగా.. సమ్మక్కకు రక్తహీనత సమస్య ఉందని, 6 శాతం మాత్రమే రక్తం ఉండటంతోపాటు ఉమ్మనీరు తగ్గిపోవడాన్ని గుర్తించి ములుగు జిల్లా వైద్యశాలకు రెఫర్ చేశారు. అంబులెన్స్‌లో ములుగు తీసుకొస్తుండగా గోవిందరావుపేట సమీపంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ టెక్నీషియన్ శివలింగప్రసాద్ ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. సమ్మక్కకు ఇది ఐదో కాన్పు. ఈఆర్సీపీ డాక్టర్ మౌనిక సలహాతో కావాల్సిన మందులు అందించి.. తల్లి, శిశువును జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బందికి సమ్మక్క కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈఎంటీతో పైలట్ యాకూబ్ పాషా, ఆశా వరర్ శ్రీదేవి ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

