ఔను.. వాళ్లిద్దరు పెండ్లి చేసుకున్నరు.. ప్రేయసి జార్జినాతో రొనాల్డో వివాహం
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన సుదీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్స్ను వివాహం చేసుకున్నాడు. దాదాపు పదేండ్లుగా కలిసి ఉంటున్న ఈ జంట పోర్చుగల్ రాజధాని లిస్బన్ సమీప పట్టణం కాస్కాయ్స్లో తమ ఐదుగురు పిల్లలు, అత్యంత సన్నిహితులు సమక్షంలో ప్రైవేట్ సివిల్ రిజిస్టర్ వివాహం చేసుకుంది.
- పదేండ్ల సహజీవనం తర్వాత పెండ్లి బంధంలోకి
లిస్బన్ : ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన సుదీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్స్ను వివాహం చేసుకున్నాడు. దాదాపు పదేండ్లుగా కలిసి ఉంటున్న ఈ జంట పోర్చుగల్ రాజధాని లిస్బన్ సమీప పట్టణం కాస్కాయ్స్లో తమ ఐదుగురు పిల్లలు, అత్యంత సన్నిహితులు సమక్షంలో ప్రైవేట్ సివిల్ రిజిస్టర్ వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని రొనాల్డో పబ్లిక్ రిలేషన్స్ బృందం బ్రన్స్విక్ గ్రూప్ అధికారికంగా ధ్రువీకరించింది. అనంతరం 41 ఏండ్ల రొనాల్డో, జార్జియా తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పెండ్లి ఉంగరాలను ధరించిన ఫోటోను పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులకు వెల్లడించారు.
స్పానిష్ మోడల్, వ్యాపారవేత్త అయిన 32 ఏండ్ల జార్జినాను 2016లో మ్యాడ్రిడ్లోని ఓ లగ్జరీ స్టోర్లో కలిసిన రొనాల్డో ఆమెతో ప్రేమలో పడ్డాడు. అక్కడ నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు అలనా మార్టినా, బెల్లా ఎస్మరాల్డా ఉన్నారు. గతేడాది ఆగస్టు 11న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీన వివాహ బంధంతో ఒక్కటైంది. జార్జినాతో సహజీవనానికి ముందే రొనాల్డోకు కొడుకు క్రిస్టియానో జూనియర్, సరోగసి ద్వారా పుట్టిన కవలలు ఇవా-మాటియో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

