రాయపోల్ ఎప్రిల్ 05 :గజ్వేల్లోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా రాయపోల్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వుగారి యాదవ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు శనివారం ఉదయం ర్యాలీగా క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమని, అయితే హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థపై నేరుగా దాడి చేసినట్లేనని పేర్కొన్నారు.
కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఇది కార్యాలయంపై దాడి కాదు, ప్రజాస్వామ్యంపై దాడి. ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక దాడికి బాధ్యులైన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా క్యాంప్ కార్యాలయాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని కోరారు.