న్యూఢిల్లీ : దేశీయ, అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయం ఇది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశ, విదేశాలకు నడుపుతున్న విమాన సర్వీసులకు సంబంధించి 352 సాంకేతిక లోపాలు నమోదయ్యాయని, ఇందులో 334 లోపాలు దేశీయ ఫ్లైట్ సర్వీస్‌లకు సంబంధించినవేనని కేంద్రం తాజాగా పార్లమెంట్లో వెల్లడించింది.
ఈ సాంకేతిక సమస్యల స్వరూపం, నిర్దిష్ట వివరాలను మంత్రి వెల్లడించలేదు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థలు క్రమం తప్పకుండా నిర్వహణ పరీక్షలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ సూచిస్తున్నది. భద్రతాపరమైన ఉల్లంఘనలకుగాను విమానయాన సంస్థలకు (2024 నుంచి జూన్ 2026) డీజీసీఏ 382 షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
