ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 4 : పరిపాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. హరీశ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్‌రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారిని బయట తిరగనీయబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకులపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్వీ నాయకులు ఫిర్యాదు చేశా రు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంతోకాలంగా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న హరీశ్‌రావుపై ఉద్దేశపూర్వకంగానే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఆయనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని అభిప్రాయపడ్డారు. అందుకే వారికి హరీశ్ లీగల్ నోటీసులు పంపారని చెప్పారు.