Madasu Srinivas | గజ్వేల్, మార్చి 26 : గత కాంగ్రెస్ పాలనలో మొదలుకొని ఈ 15 నెలల కాలంలో గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, కేసీఆర్ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దశాబ్దాల కాలం పాటు గజ్వేల్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన బతుకుదెరువు మార్గాల్ని కూడా కేసీఆర్ కల్పించారన్నారు. ఒకనాడు కరువుతో కనిపించే గజ్వేల్ నేడు అన్నపూర్ణగా మారిందంటే దానికి కారణం కేసీఆర్ దూరదృష్టి మాత్రమే అన్నారు. కేసీఆర్ పాలనలో మొదటి ఐదు సంవత్సరాల అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యేగా నర్సారెడ్డి కూడా సాక్షే అని గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధిని పొగిడిన సందర్భాలను నర్సారెడ్డి మరిచిపోయి మాట్లాడడం సరైంది కాదన్నారు.
నర్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులుగా ఉండి కూడా చేయలేని అనేక సమస్యలకు కేసీఆర్ పరిష్కారం చూపారని, అవి ప్రజల అనుభవంలో ఉన్నాయని అన్నారు. పదే పదే మిగిలిపోయిన పనుల గురించి కేసీఆర్, హరీష్ రావుల మీద మాట్లాడుతున్న మీరు ఈ పదిహేను నెలల కాలంలో వాటిని ప్రారంభించేందుకు ఎందుకు కృషి చేయడం లేదో చెప్పాలని అన్నారు.
కేవలం ప్రజల్లో క్రెడిట్ గేమ్ కోసం కేసీఆర్‌ను విమర్శిస్తే సరిపోదని, కేసీఆర్ చేసిన దాంట్లో కనీసం పదోవంతు పనులను సాధించడానికి పనిచేయాలని హితవు పలికారు. మీ పార్టీలోని గ్రూపుల గొడవలలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు పోటీపడుతున్న మీరు అభివృద్ధి పనుల సాధనలో పోటీ పడితే ప్రజలు హర్షిస్తారని అన్నారు.
బస్టాండ్, డబుల్ బెడ్రూం, నిర్వాసితుల సమస్యల మీద పదే పదే మాట్లాడే మీరు ఆ సమస్యల పరిష్కారానికి మీరు చేసిన ప్రయత్నం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ మీద రాజకీయ విమర్శ కోసం పాదయాత్ర నిర్వహించిన మీరు నడిచిన కిలోమీటర్ దూరానికి ఒక కోటి రూపాయల నిధులు తీసుకొచ్చినా ప్రజలు సంతోషించేవారని కానీ ఈ ప్రభుత్వంలో కేసీఆర్ మంజూరి చేసిన పనులనే రద్దు చేశారని దానిపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే బాగుండే దన్నారు.
గజ్వేల్ ప్రజలందరికి తెలుసు..
గత పదకొండు సంవత్సరాల నుండి హరీష్ రావు అధికారంలో ఉన్నా లేకున్నా ఈ నియోజకవర్గ ప్రజలకు అలుపెరగకుండా సేవ చేస్తున్నారని, కరోనా కష్టకాలంలో కూడా గజ్వేల్ కు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పి అండగా ఉన్నది హరీష్ రావు అనే విషయం గజ్వేల్ ప్రజలందరికి తెలుసన్నారు.
తెలంగాణ పోరాటంలోనైనా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే నాయకుడు హరీష్ రావు గారేనని అయనను విమర్శించడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ , హరీష్ రావుమీద పొద్దుపోవడం మాని ప్రజల కోసం పని చేస్తే బాగుంటుందని లేనిపక్షంలో ప్రజా క్షేత్రంలో మీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కొమురయ్య, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, నాయకులు భాస్కర్, రామస్వామి యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి