అనతికాలంలోనే మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది కన్నడ భామ రుక్మిణి వసంత్. ముఖ్యంగా గతేడాది ‘కాంతార: ఛాప్టర్-1’తో పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు గుర్తింపు దక్కింది. ఇదే ఊపులో ఈ అమ్మడు వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌ను చేజిక్కించుకుంటున్నది. ఇప్పటికే ఈ సొగసరి ఎన్టీఆర్ ‘డ్రాగన్’, యష్ ‘టాక్సిక్’ చిత్రాల్లో నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం తెలుగులో రుక్మిణి వసంత్ మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది.
శర్వానంద్ సరసన ఆమె కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో రుక్మిణి వసంత్‌ను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో నాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.