రాయపోల్ ఆగస్టు 22 : రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన కరుణాకర్ బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా నాగరాజు బాధ్యతలను చేపట్టారు. కాగా, చేర్యాల మండలంలో పనిచేసిన వెంకటేశ్వర్లు రాయపోల్ జిల్లా పరిషత్ నేత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సహకారంతో రానున్న పదవ తరగతి పరీక్షలో 100% ఉత్తీర్తణత సాధించే విధంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. అందరి సహకారంతో పాఠశాల అభివృద్ధితోపాటు చదువులు ముందుండి జిల్లాలో రాయపోల్ ఉన్నత పాఠశాలను ఆదర్శంగా ఉండే విధంగా చర్య తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.