Vanteru Pratap Reddy | దళితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి : వంటేరు ప్రతాపరెడ్డి
అంబేద్కర్ సంఘం, బహుజ ఫ్రంట్, ఎమ్మార్పీ ఎస్ తదితర సంఘాల నాయకులపై నమోదయిన కేసులను వెంటనే ఎత్తివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వర్గల్,మార్చి6 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో తలెత్తిన వివాదంలో అంబేద్కర్ సంఘం, బహుజ ఫ్రంట్, ఎమ్మార్పీ ఎస్ తదితర సంఘాల నాయకులపై నమోదయిన కేసులను వెంటనే ఎత్తివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాచారంలో అంబేద్కర్ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దె స్థలాన్ని పరిశీలించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం సంఘం నాయకులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో తలెత్తిన వివాదం కేసుల వరకు వెళ్లడం బాధాకరమన్నారు. భారతదేశానికి రాజ్యాంగం రాసిన మహానీయుడి విగ్రహం ఏర్పాటు చేస్తే ఓర్వలేని కొంతమంది సహకారంతో ఆర్అండ్ బీ అధికారులు రాత్రికి రాత్రే గెద్దను కూల్చడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో శాంతియుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పోలీసులు,ఆర్అండ్బీ అధికారులపై ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ భహాయంలో రోడ్డు వెడల్పుకోసం నిధులు కూడా మంజూరు చేశామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రోడ్డును వెడల్పు చేసే పనిని పక్కకు పెట్టిందని, తద్వారా ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. అందరి ఆమోదంతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేలా గామస్తులు చొరవ చూపాలని కోరారు. విగ్రహం ఏర్పాటుకు తనవంతు ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ల్యాతొల్ల వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

