BRSV | మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ పై బీఆర్ఎస్వీ ఉస్మానియా యూనివర్సిటీ విభాగం నాయకులు ఓయూ ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నట్వంటి వ్యక్తులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి మా నాయకుడు హరీశ్ రావు మీద వర్షాలు పడకుండా తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు చేస్తున్నారని మాట్లాడటం హేయమైన చర్య అని.. తక్షణమే హరీశ్‌రావుకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హరీష్ రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిపై ఫైర్ అయిన బీఆర్ఎస్వీ నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకుంటే బయట తిరగనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు.
హరీష్ రావుపై తప్పుడు ప్రచారాలు చేసినందుకు కాంగ్రెస్ నాయకులపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్వి నాయకులు pic.twitter.com/s9jqjEaWeX
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026