CLAT | దేశంలో 26 నేషనల్ లా యూనివర్సిటీ (NLU)లు ఉన్నాయి. వీటిలో లా చేయాలనేది ప్రతి విద్యార్థి కల. ఈ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘కామన్ లా అడ్మిషన్స్ టెస్ట్ (క్లాట్) నిర్వహిస్తున్నారు. దీని ద్వారా డిగ్రీ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన CLAT 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ చేసుకునే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అర్హతలు
యూజీ కోర్సులకు 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైనవారు. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్ఎల్బీ (LLB) డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైనవారు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 6న నిర్వహిస్తారు.
యూనివర్సిటీలు
బెంగళూరు, హైదరాబాద్, భోపాల్, కోల్‌కతా, జోధ్‌పూర్, రాయ్‌పూర్, గాంధీనగర్, లక్నో, పటియాల, పట్నా, కోచి, కటక్, రాంచి, విశాఖపట్నం, గువాహటి, తిరుచిరాపల్లి, ముంబై, నాగపూర్, ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజినగర్), సిమ్లా, జబల్పూర్, సోనిపట్, ప్రయాగ్‌రాజ్, అగర్తల, సిల్వాస, షిల్లాంగ్‌లలో ఉన్న నేషనల్ లా కాలేజీల్లో క్లాట్ 2027 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు consortiumofnlus.ac.in/clat-2027/లో చేసుకోవాలి.