Tiger | తొగుట, డిసెంబర్ 27 : సిద్దిపేట జిల్లాలో పులి సంచారంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మిరుదొడ్డి మండలం అందె, కొండాపూర్, తొగుట మండలం వరదరాజుపల్లి, గోవర్ధనగిరి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. పాద ముద్రల ఆధారంగా పులి సంచారాన్ని గమనించిన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పులి సంచరిస్తున్న విషయం తెలియగానే ఈ ఊళ్లకు పక్కనే ఉన్న గోవర్ధనగిరి, ముత్యంపేట్, మిరుదొడ్డి మండలం అందె, కొండాపూర్ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల ప్రజలకు పులి సంచారంపైన ఫారెస్ట్ అధికారి సందీప్ కుమార్ మాట్లాడుతూ.. నిన్న ఇక్కడ పులి కాలి ముద్రలు కనిపిస్తున్నాయని సమాచారం వచ్చిందని.. దీంతో సిద్దిపేట రెంజ్ సిబ్బంది, మా సిబ్బంది అనుమానస్పదమైన స్థలాన్ని వెతకడం జరిగింది.
ఇది మన వరదరాజుపల్లి శివారులో ఒక పోలంలో అనుమానస్పదంగా పాదముద్రలు కనిపించాయి. నిన్న రాత్రి నుండి దర్యాప్తు చేయడం జరిగిందని.. దాని కదలికలు ఇక్కడే కనిపించాయని.. మేము మూడు టీంలుగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు. ఇక్కడి నుంచి సిద్దిపేట మండలం తోర్నాల గ్రామం దిక్కు పోయినట్టు ఉందని అక్కడ కుడా పాద ముద్రలు కనిపిస్తున్నాయని తెలిపారు. పులితో అందరూ జాగ్రత్తగా ఉండాలని రైతులు పొలాల కాడికి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తమ జీవాలను సాయంకాలం తమవెంటే ఇంటికి తీసుకరావాలని ఆయన చెప్పారు.


Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్టీ డౌన్.. 23 శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
పాలమూరు ప్రాణం మీదికొస్తే శంఖారావమే!
Gold Price | ఆల్టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ధర 1.42 లక్షలు