Rayapol SI manasa | రాయపోల్, జూలై 09 : రాయపోల్ మండల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన మానసను బుధవారం తిమ్మకపల్లి గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మానస మాట్లాడుతూ.. శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు సహకారం అందించాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వివరిస్తే సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ప్రతీ గ్రామంలో పర్యటించి ప్రజలు, యువతను చైతన్యం చేసి గ్రామాల్లో ప్రశాంత వాతావరణ కోసం కృషి చేస్తామని తెలిపారు. యువత. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని మంచి భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారిపై నిఘా వేసి ఉంచాలని.. చదువుకుంటేనే విద్యార్థులకు సమాజంలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.
చెడు వ్యసనాలకు యువత స్వస్తి చెప్పాలని పేర్కొన్నారు. తిమ్మక్కపల్లి గ్రామంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని.. మహిళలందరూ, గ్రామస్తులు తమను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి. యువజన నాయకులు ఇప్ప దయాకర్. కిరణ్ కుమార్ రెడ్డి. మల్లేశం. శ్రీకాంత్ రెడ్డి. మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం