నారాయణరావు పేట, మే 4 : ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను తక్షణమే ఆపివేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ బాలకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి దండకారణ్యంలో శాంతిని నెకొల్పాలని కోరారు. మావోయిస్టులు, ఆదివాసీలతో కలిపి సుమారు 480 మంది భారతీయులు ప్రాణాలను కోల్పోయారన్నారు.
దేశ చట్టాలు సాయుధ గర్షణను సంబంధించిన నియామాకాలను పక్కన పెట్టి మావోయిస్టులు, ఆదివాసీలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. వరంగల్ సభలో కేసీఆర్ ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని సభలో ప్రకటించారు. లక్షలాది ప్రజల నుంచి ఆపరేషన్ కగార్‌ను ఆపాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, మేధావులు కాల్పుల విరమణ, చర్చల కోసం కేంద్రం పై ఒత్తిడి తేవాలన్నారు. కగార్‌ను నిలివేసి శాంతిని నెలకొల్పాలన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీలు ప్రభాకర్, భాను, రత్నాకర్, కిష్టయ్య నాయకులు పాల్గొన్నారు.