రాయపోల్, మే 2: పెద్దమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి లు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేవిధంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండే వారని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లె కన్నీళ్లు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కేసీఆర్ పాలన ప్రజలు కోరుకుంటున్నారని గుర్తు చేశారు.