Primary School | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే మరో ఘటన ఇది. పాఠశాల అద్దె భవనం విద్యార్థుల పాలిట శాపంలా మారింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల నిర్వహణ అద్దె భవనంలో కొనసాగుతుండగా.. కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భవనానికి అద్దె చెల్లించడం లేదు.
తనకు అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తరగతి గదులకు తాళం వేశాడు. ఈ స్కూల్ తెరవకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తరగతుల్లో కూర్చొని పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారులు ఇలా రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నారు.
విద్యార్థుల పాలిట శాపంలా మారిన అద్దె భవనం
అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తరగతి గదులకు తాళం వేసిన యజమాని
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో అద్దె భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు కొన్ని నెలలుగా అద్దె చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం
పాఠశాల… pic.twitter.com/rCHrc58sp9
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2026
Karthika Deepam | కార్తీక దీపం రెండో సీజన్ 600 ఎపిసోడ్లు పూర్తి.. ప్రత్యేక ప్రోమోతో సంబరాలు
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు పెరగనున్న రద్దీ.. వేగంగా దర్శనాలు పూర్తయ్యేలా టీటీడీ ఏర్పాట్లు