Deputation | నారాయణరావుపేట, జూలై 17 : నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై మరో పాఠశాలకు పంపించడం పట్ల వారి డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు.
విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేసి తమ పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను భోదిస్తున్న ఉపాధ్యాయులను అకారణంగా డిప్యూటేషన్‌పై పంపించడం తగదన్నారు.
ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేయకపోతే విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్తామని హెచ్చరించారు. విద్యార్థుల నిరసనకు వారి తల్లిదండ్రులతోపాటు పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం