పార్లమెంట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్‌లో సిద్దిపేట స్టీల్ బ్యాంక్ గురించి ప్రచురణ అధికారులు, ప్రజలకు అభినందనలు తెలిపిన మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట, జూలై 22: సిద్దిపేట పట్టణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా జాతీయ స్థాయిలో స్ఫూర్తినిస్తున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్‌ను నివారించాలనే ఆలోచనతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చేసిన వినూత్న ప్రయత్నమే స్టీల్ బ్యాంక్. ప్లాస్టిక్ రహిత పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన తీసుకున్న కార్యక్రమం వార్డు వార్డునా స్టీల్ బ్యాంక్. ఆయా వా ర్డుల్లో జరుగుతున్న శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో సిద్దిపేట పట్టణంలోని 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించారు. ప్రతి యేటా కేంద్రం వెలువరించే పార్లమెంట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్‌లో ‘ఇది అద్భుతమైన కార్యక్రమం ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఇకడి పాలకులు స్టీల్ బ్యాంక్ కార్యక్రమం తీసుకురావడం అద్భు తం’ అని అందులో మెచ్చుకున్నారు. సిద్దిపేట స్టీల్ బ్యాంక్ గొప్ప కార్యక్రమం..అద్భుతమని కొనియాడుతూ ఇదే స్ఫూర్తితో దేశం మొత్తంలో అమలుపరుస్తామని అందులో ప్రచురించారు.
సిద్దిపేట ఖ్యాతిని జాతీయస్థాయిలో నిలుపడం గర్వకారణం
ఏదైనా ఒక పని మొదలు పెట్టినపుడు అవుతుందా కాదా అని ఆలోచనతో మొదలు పెడ తాం.. కానీ సిద్దిపేట ప్రజల అదృష్టం ఇకడ ఏ కార్యక్ర మం తలపెట్టినా ఫలితం ఇస్తున్నదనే నమ్మకం ఉంది. అమ లు చేసిన అనేక కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. పార్లమెంట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్‌లో సిద్దిపేట స్టీల్ బ్యాంక్ మంచి కార్యక్రమం అని ప్రచురించడం జాతీయస్థాయిలో మరో రికార్డు సిద్దిపేటకు రావడం చాలా గర్వంగా ఉన్నది. ఒక ప్రజా ప్రతినిధిగా పనిచేయ డం ఎంత గొప్పదో.. అది ప్రజలు సద్వినియోగం చేసుకొని ఫలితం రావడం గొప్ప సంతృప్తిని ఇస్తున్నది. సిద్దిపేట ఖ్యాతిని జాతీయస్థాయిలో నిలుపడంలో భాగస్వాములైన ప్రజలు, అధికారులకు అభినందనలు.. శుభాకాంక్షలు.
-మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు