రాయపోల్, ఎప్రిల్ 21: సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండలంలోని రాంసాగర్లో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆవాహిత దేవతాపూజ, ఆవాహిత దేవతహవనం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. రాత్రి 9 గంటలకు చిరుతల రామాయణం జరుగనుంది.
ఇక మంగళవారం ఉదయం 8 గంటలకు ఆవహిత దేవతాపూజ, శ్రీ రామ మూలమంత్ర వాహనం, బలిప్రధానం, పూర్ణాహుతి, కలష ఉద్వాసన, ఆశీర్వచనం ఉంటుంది. 11.30 గంటలకు శ్రావణా నక్షత్రయుక్త శుభలగ్నం పుష్కరాంశ సుమూత్రమున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు రాములోరి రథ ఊరేగింపు నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.