రాయపోల్, మే30 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో సత్యనారాయణ రెడ్డి శుక్రవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ప్రతి విద్యార్థికి పాఠశాల ఓపెనింగ్ రోజే అందేవిధంగా చూడాలని ఆదేశించారు.
ప్రతి ఉపాధ్యాయుడు బడిబాటలో పాల్గొనాలని ఎంఈవో సత్యనారాయణరెడ్డి సూచించారు. విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ బడి అంటే ఇష్టపడేలా అవగాహన కల్పించాలన్నారు. పేదవాళ్లు డబ్బులను వృథాగా ప్రైవేటు పాఠశాలలకు పెట్టి ఇబ్బందులకు గురికావద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అనేక సౌకర్యలతో కూడిన విద్య అందుతుందని తెలిపారు.