సిద్దిపేట, ఫిబ్రవరి 4 : దళితబంధు పథకానికి మొదటి విడుత లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం చెల్కలపల్లి, ఎల్లయాపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి సిద్దిపేటలో క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును ఎల్లయపల్లి గ్రామస్తులు కలిసి పూల మొక్కను అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. దళిత జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకం వరం అన్నారు. మొదటిదశలోనే తమ గ్రామాలుగా ఎంపిక చేసినందుకు గర్వంగా ఉందన్నారు. దళిత బంధుతో సామాజికమార్పు వస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ కీసర పాపయ్య, సర్పంచ్ జీవితాబాబు, నాయకులు రమేశ్, నర్సయ్య, శంకర్, శ్రీనివాస్, మల్ల య్య, ఎల్లయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి మండలంలోని నర్సింహులపల్లి ఎంపిక కావడంపై లబ్ధ్దిదారులు, గ్రామస్తులు హార్షం వ్యక్తం చేస్త్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గ్రామంలో నలుగురు లబ్ధ్దిదారుల ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పం చాయతీ పాలకవర్గ సభ్యులు, దళితులు, నాయకులు పాల్గొన్నారు.