కొమురవెల్లి, మే 31 : దేశంలో కార్పొరేట్ శక్తులకు బీజేపీ పెద్దపీట వేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యు డు చుక్కా రాములు అన్నారు. కొమురవెల్లి మండల కేం ద్రంలో మంగళవారం జరిగిన సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు హాజరై ఆయన మాట్లాడారు. బీజేపీ వచ్చిన తర్వాత సంపన్న వర్గం, అట్టడుగు పేద లను దేశం రెండు వర్గాలుగా విడిపోయిందన్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు సాధారణ కంపెనీగా ఉన్న ఆదానీ కంపెనీ నేడు అంబానీని మించిపోయిందన్నారు. బీజేపీ కార్పొరేట్ పాలనగా మారిందని, సీఎం కేసీఆర్ బీజేపీపై చేస్తున్న పోరాటాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
బీజేపీ పాలనలో ప్రజలపై దాడులు పెరిగాయన్నారు. పెట్రో, డీజిల్, గ్యాస్, వంట నూనె 200 శాతం పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్న బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఐక్యఉద్యమాలు చేస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి కళావతి, శెట్టిపల్లి సత్తిరెడ్డి, భాస్కర్, కొంగరి వెంకట్ మావో, కృష్ణారెడ్డి, ఆలేటి యాదగిరి, చొప్పరి రవి, సనాది భాస్కర్, బండకింది అరుణ్‌కుమార్, అత్తిని శారద పాల్గొన్నారు.