తొగుట : యువకులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలని తొగుట ఎస్ఐ రవికాంతరావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంని వెంకటరావుపేటలో సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకొని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామస్థాయి వాలీబాల్ పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ లేదని చదువులతోపాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. సెల్ ఫోన్ వినియోగం మూలంగా అమూల్యమైన సమయం వృథా అవుతుందని యువత గ్రహించాలన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగానే 99 శాతం రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపొద్దని, హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య, వార్డు సభ్యులు పిట్ల వెంకటేష్, జహంగీర్, ఎంగలి నరేందర్, మిద్దె శ్రీనివాస్, నాయకులు డబ్బికారి పెంటోజీ, పిట్ల వెంకటయ్య, మత్స్య శాఖ చైర్మన్ కత్తుల నరేష్, పెద్దమ్మ దేవాలయ చైర్మన్ బెజ్జనమైన రవి, సుతారి రాములు, ఈదుగాళ్ల పర్శరాములు, ఎర్రోళ్ల చంద్రం, కత్తుల రమేష్, కొక్కొండ సురేష్, వడ్డె నర్సింలు, పులిగారి నర్సింలు తదితరులు ఉన్నారు.