Cyber Crimes | హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 26 : సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హస్నాబాద్ షీ టీమ్ బృందం ప్రజలకు సూచించింది. పట్టణ పరిధిలోని ఆరపల్లిలో ఇవాళ సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్, మాటలు నమ్మవద్దని, సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని, సెల్‌ఫోన్‌కు బానిస కావొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ సదయ్య, కానిస్టేబుల్స్ ప్రశాంతి, కృష్ణతోపాటు ఆరపల్లివాసులు గొర్ల కొమురయ్య, మ్యాదరబోయిన శ్రీకాంత్, గొర్ల నాగయ్య, గంగుల రాజయ్య తదితరులు ఉన్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా