Best Education Officer | రాయపోల్, సెప్టెంబర్ 6 : సిద్దిపేట జిల్లా ఉత్తమ విద్యాధికారిగా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి ఎంపికయ్యారు. ప్రస్తుతం రాయపోల్ మండలంలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూనే రాయపోల్ మండల విద్యాధికారిగా పూర్థి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం సిద్దిపేటలో జరిగిన జిల్లా స్థాయి వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తమ ఎంఈవో అవార్డుతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా స్థాయిలో అవార్డు రావడం అనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తానని తెలిపారు. అలాగే మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ముగ్గురు పి వెంకటేశం, అబ్దుల్లా, ఎస్.నర్సింహలకు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్నారు.
Boy Accidentally Fires Air Gun | ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేల్చిన బాలుడు.. అతడి అన్న మృతి
Siddaramaiah | కర్ణాటక సీఎం కారుపై చలానాలు.. డిస్కౌంట్లో కట్టిన సిబ్బంది
Vijayawada Utsav | విజయవాడలో క్రేజీ ఈవెంట్స్.. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సందడి..!