Road Potholes | తొగుట, జూలై 23: భారీ వర్షాలకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు వర్షపు నీటితో బురదమయమై చిత్తడిగా మారాయి. రహదారులపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలోని మెట్టు గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలుగా ఏర్పడి బురదగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యావసర సరుకులు తీసుకురావడానికి బయటకు రావాలంటే భయపడుతున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కొన్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. రహదారులపై మట్టి, కంకర తేలడంతోపాటు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ నరకకూపంగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Ganja Seized | ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vice president Elections | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఈసీ