కొండపాక, అక్టోబర్ 11 : జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న టాటా ఏసీ ఆటో ముందు వెళ్తున్న బొలెరో గూడ్స్ వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న హరికృష్ణ, రజితలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది మహిపాల్, రమేశ్ అక్కడకు చేరుకొని ప్రథమ చికిత్స చేసి గజ్వేల్ దవాఖానలో చేర్చారు. బాధితుల వద్ద లభించిన రూ.25,910 దవాఖాన డ్యూటీలో ఉన్న డాక్టర్‌కు అంబులెన్స్ సిబ్బంది అందించారు.