Sand Filters | కంది, మార్చి 19 : అక్రమ ఇసుక ఫిల్టర్లపై ఇవాళ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. కంది మండల పరిధిలోని చిద్రుప్ప, బ్యాతోల్, ఆరుట్ల గ్రామాలలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లపై తహసీల్దార్ విజయలక్ష్మి సిబ్బందితో దాడులు జరిపి సామాగ్రిని ధ్వంసం చేశారు.
ముందస్తు సమాచారం తెలుసుకున్న ఫిల్టర్ల నిర్వాహకులు అక్కడ ఎలాంటి వాహనాలు పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. అధికారులు వెళ్లిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఉన్న యంత్రాలను ధ్వంసం చేశారు. అక్రమంగా కృత్రిమ ఇసుకను తయారు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్ధార్ హెచ్చరించారు.