Rayapole Sarpanch | రాయపోల్, డిసెంబర్ 30 : రాయపోల్ మండల పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం చిన్నమాసాన్ పల్లి గ్రామ సర్పంచ్ రేకుల నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం మిషన్ భగీరథ ఏఈ అభినయ్తో కలిసి చిన్నమాసాన్ పల్లి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను గల్లి గల్లీలో తిరిగి సమస్యను వివరించి అధికారులకు చెమటలు పుట్టించారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి తమ గ్రామస్తులకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని.. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైందని.. ఈ విషయం పలుమార్లు అధికారులకు సూచించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా తమ గ్రామానికి ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.
గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత రెండు సంవత్సరాల క్రితం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించినప్పటికీ ఇంతవరకు ట్యాంకు కనెక్షన్ ఇవ్వడం లేదని గుర్తు చేశారు. గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా సంబంధించి శాఖ అధికారులు సహకారం అందిస్తే తాము భాగస్వాములై గ్రామంలో అదే విధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Sannia Ashfaq: నా ఇంటిని ముక్కలు చేశారు.. విడాకులపై పాకిస్థాన్ క్రికెటర్ భార్య ఆవేదన