Rythu Runamafi | రాయపోల్, మార్చి 01 : ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైపోయిందని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అలివిగాని హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ కాలేదంటూ సొంత పార్టీ నేతలే బోరుమంటున్నారు.
తాజాగా రాయపోల్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సత్తు అశోక్ రెడ్డి తనకు రుణమాఫీ కాలేదంటూ వాపోయాడు. ‘సారూ.. మాకు రుణమాఫీ ఎప్పుడు వస్తుంది. అందరికి రుణమాఫీ అయింది. మాకు ఎందుకు కావడం లేదు అంటూ రాయపోల్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సత్తు అశోక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో మొదటి పనిచేస్తున్నానని.. అయినప్పటికీ తమకు రుణమాఫీ ఇంతవరకు రాలేదు. రూ. 2 లక్షలపైగా ఉంటే వాటిని కట్టేశామని.. మిగతా రెండు లక్షల రూపాయలు మాఫీ కావాల్సి ఉండగా.. ఎందుకు కావడం లేదని కాంగ్రెస్ కార్యకర్త, రైతు అశోక్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు.
తప్పు ప్రభుత్వానిదా.. బ్యాంకర్ల తప్పా.. తమకు ఏమి అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నాడు. అందరికీ రుణమాఫీ జరిగిందని ప్రచారం జరుగుతుందని.. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తనకు రుణమాఫీ కాలేదని. బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగెత్తి పోయానని ఆందోళన వ్యక్తం చేశాడు.
మా ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో..
రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మా ప్రభుత్వం ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ చేయకపోవడంతో తమకు నిరాశ మిగిలిందని. తమ తోటి రైతులకు ఒక లక్ష 95 వేలు మాఫీ చేశారు. రూ.2 లక్షలు ఉన్న తమకు మాఫీ కాలేదని.. బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి రుణమాఫీ ఇక రాదని ఆశలు వదులుకున్నామని సత్తు అశోక్ రెడ్డి పేర్కొన్నారు.
రైతులపై దయతలిచి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని అశోక్ రెడ్డి కోరుతున్నాడు. ఇదే విషయం సంబంధిత వ్యవసాయ అధికారులను అడిగితే ప్రాసెస్‌లో ఉందని రుణమాఫీ వస్తుందని జవాబు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి