Raksha Bandhan | రాయపోల్, ఆగస్టు 09 : రక్షాబంధన్ పవిత్రమైన సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో పర్యటించగా పలువురు ఆడపడుచులు ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌కు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయత అనుబంధం పెంచేది ఈ రాఖీ పండుగ అని అన్నారు.
సోదరుడు, సోదరి మధ్యలో ఉన్న ప్రేమ, బాధ్యత అనుబంధాన్ని సూచించే గొప్ప పండుగే రాఖీ అని అన్నారు. తెలంగాణలో కులమతాలకు అతీతంగా సోదర భావంతో జరుపుకునే పండుగల్లో ఇదొక గొప్ప పండుగ అని అన్నారు. ఈ పండుగ ద్వారా మానవ సంబంధాల గొప్పతనం గుర్తుకు వస్తుందన్నారు. బంధాలను అతికించే ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని, దేవుడి దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాని ఆయన పేర్కొన్నారు.
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ పండుగ ప్రేమానురాగాలకు సూచికగా జరుపుకుంటారని గుర్తు చేశారు. రాఖీ పండుగ వేడుకలు సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. అన్న అంటే అమ్మలో సగం.. నాన్నలో సగం అని చెబుతూ చెల్లి తన అన్న ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కడుతుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం మండల కేంద్రంలో జీఎల్ఆర్ గార్డెన్లోజరిగిన సీనియర్ జర్నలిస్టు నాగ వెంకట్ రెడ్డి తమ్ముడి కుమార్తె పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు చింతకింది మంజూరు, మాజీ ఉప సర్పంచ్ సత్తవ్వ, స్వామి, అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్.. వీడియో