Women Acts | గజ్వేల్, ఏప్రిల్ 28: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు అన్నారు. ఇవాళ గజ్వేల్ సమీకృత మార్కెట్లో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ శ్రీరాములు మాట్లాడుతూ.. మహిళలకు భద్రత కల్పించే విషయంలో తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
ఎలాంటి సంఘటన జరిగినా పోలీసులను ఆశ్రయించాలన్నారు. తప్పకుండా వారిపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రామాల్లో సంచరించే అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, యువత గ్రామాల్లో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని.. అలాంటి వారిపై నిఘా పెట్టాలని అవగాహన కార్యక్రమంలో అందరికీ సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ లావణ్య, శ్రీనివాస్, మహేష్‌లు పాల్గొన్నారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్