సిద్దిపేట కమాన్, మే 22 : రెండు రోజులుగా కురిస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన వడ్లు వానలకు తడుస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో పోసిన ధాన్యం వరద నీటికి కొట్టుకుపోవడంతో కలత చెందుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
అకాల వర్షానికి సిద్దిపేటలోని మార్కెట్ యార్డులో పలువురి రైతుల ధాన్యం తడిసిపోయింది. జాగ్రత్తలు తీసుకున్నప్పటికి వర్షం నీరు అధికంగా రావడంతో కొంతమంది రైతుల వడ్లు వరదకు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో వెంటవెంటనే కొనుగోళ్లు జరుపుతూ ధాన్యాన్ని తరలించాలని రైతులు కోరుతున్నారు.
తడిసిన ధాన్యాన్ని చూపున్న మహిళా రైతు..