Oil Palm Gardens | తొగుట, మార్చి 26 : పెద్ద మాసాన్ పల్లి గ్రామంలో ఆయిల్ పామ్ తోటలను వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక మొత్తంలో ఆయిల్ పామ్ మొక్కలు రెండు నుంచి నాలుగు సంవత్సరాలు వయస్సు లోపు ఉన్నాయి. ఎండల నుండి ఆయిల్ పామ్ తోటలను సంరక్షించుకోవడానికి యాజమాన్య పద్ధతులు పాటించాలి. రైతులు ముఖ్యంగా నీటి యాజమాన్యంపై దృష్టి పెట్టాలన్నారు.
మొవ్వు దగ్గర ఉన్న మట్టలు ఒకటి లేక రెండు మట్టలు మాత్రమే విచ్చుకోకుండా ఉండాలి. రెండు కంటే ఎక్కువ మట్టలు విచ్చుకోకపోతే ఆ మొక్క నీటి ఎద్దడికి గురి అయినట్లుగా గుర్తించాలి. ఆ మొక్కలకి వెంటనే నీళ్లను అందించాలి. వేసవిలో మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు గల మొక్కలకి సుమారు రోజుకి 300 లీటర్ల నీళ్లు అవసరం ఉంటుంది.
సాధారణంగా బిందు సేద్యం గంటకు 80 లీటర్ల నీటిని విడుదల చేస్తుంది. కావున ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు రోజుకు 4 నుండి 5 గంటల వరకు నీటిని వదలాలి. బిందు సేద్యం ద్వారా నీటిని అందించేటప్పుడు మొక్క మొదలు నుంచి ఒక మీటర్ మొదలుకొని మూడు మీటర్ల వ్యాసార్థంలో నీటిని అందించాలి.
మల్చింగ్ :
నేలలో ఉన్న నీరు ఆవిరి కాకుండా ఉండడానికి పాదులలో మల్చింగ్ ఏర్పాటు చేసుకోవాలి. పాదు ఒక మీటర్ వ్యాసార్థం వరకు ఏర్పాటు చేసుకొని వరి గడ్డితో కప్పి ఉంచుకోవాలి లేదా ఈ పాదులలో జనము లేదా జీలుగ చల్లుకొని ఏపుగా పెరిగిన తర్వాత మొక్కలను కోసి అదే పాదుళ్లలోనే కప్పి ఉంచాలి. ఎరువులు వేసేటప్పుడు తేమ ఎక్కడైతే ఉందో అక్కడ వేసుకున్నట్లయితేఎరువులు నీటి లో కరిగిపోయి పోషకాలు మొక్కలకు అందుతాయి అని తెలిపారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి